అంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ 'వడక్కన్'
కిషోర్, శ్రుతి మీనన్ నటించిన 'వడక్కన్' మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకుంది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై వడక్కన్‌ను నిర్మించారు. ఈ చిత్రం ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది.