English | Telugu

అందులో ఉండాలంటే భయమేస్తుందని,అది తీసుకున్న మాట వాస్తవం

విజయ్ దేవరకొండ(vijay devarakonda)హీరోగా పూరి జగన్నాద్(puri jagannadh)దర్శకత్వంలో 2022 లో వచ్చిన  లైగర్(liger)మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ నటి అనన్య పాండే. హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించిన అనన్య  కొన్నిరోజుల నుంచి థెరఫీ తీసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో  రీసెంట్ గా ఇచ్చిన ఒక  ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతు నేను గతంలో థెరఫీ ని తీసుకున్నాను.కాకపోతే అంతకు ముందులా రెగ్యులర్ గా తీసుకోవడం లేదు.కెరీర్ ప్రారంభంలో ఎన్నో  విమర్శలతో పాటు ఎంతో నెగిటివిటి ని ఎదుర్కొన్నాను.దాంతో భావోద్వేగాల్ని నియత్రించుకోలేక .ఆత్మవిశ్వాసం కోల్పోయి కుంగుబాటుకి లోనయ్యాను.ఒక వ్యక్తి ఇనిస్టా లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అతను నాతో చదువుకున్నట్టుగా పోస్ట్ చేసాడు.

ఆ తర్వాత కాలేజ్,స్కూల్ గురించి నేను ఇంటర్వూస్ లో అబద్దాలు చెప్తున్నానని పోస్ట్ లు చేసేవాడు. వాటిని ఎవరు పట్టించుకోరని అనుకున్నాను.కానీ పట్టించుకుంటారనే  విషయం తర్వాత గాని అర్ధమయ్యింది. కొన్ని సందర్భాల్లో మనం సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ని చదువుతుంటాం.ఆ సమయంలో అవి పెద్దగా ప్రభావితం చెయ్యవు. కానీ తర్వాత కాలంలో మనకి గుర్తుకొస్తాయి.నాకు కూడా అలా గుర్తుకొచ్చి థెరపీ తీసుకున్నాను.ఇప్పుడున్న రోజులో సోషల్ మీడియాలో ఉండాలంటేనే భయం వేస్తుంది.మనం ఏం మాట్లాడిన ప్రజలకి తెలిసిపోతుందని చెప్పుకొచ్చింది.