అక్కినేని ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన సమంత.. లెక్కలన్నీ బయటకు రావాలి!
రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. ప్రేమికులైనా, భార్యాభర్తలైనా అకేషన్ ని బట్టి, వారి స్థోమతకు తగ్గట్టుగా గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు అయితే కొంచెం కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇచ్చుకుంటారు. అంత మాత్రాన ఆ గిఫ్ట్ లను ఖరీదులో వెలకట్టలేము. ఎందుకంటే ఆ గిఫ్ట్ లు అనేవి.. పార్టనర్ మీద ప్రేమతో, జీవితాంతం కలిసుంటామన్న ఉద్దేశంతో, మనస్ఫూర్తిగా ఇచ్చుకునేవి.