English | Telugu
ఆర్జీవీ పారిపోవడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్!
Updated : Nov 26, 2024
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు వివాదాస్పద సినిమాలు తీశాడు. అలాగే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, మార్ఫింగ్ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తానికి గత వైసీపీ హయాంలో ఆర్జీవీ హద్దుమీరి ప్రవర్తించాడని చెప్పవచ్చు. ఆ అతి ప్రవర్తనే ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేసింది. అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోల విషయంలో ఇప్పటికే ఒంగోలు పోలీసులు నోటీసులిచ్చారు. కానీ వర్మ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. (Ram Gopal Varma)
ఆర్జీవీ నోటీసులకు స్పందించకుండా, విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని.. తాజాగా ఢిల్లీ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వద్ద మీడియా ప్రస్తావించింది. దీనిపై స్పందించిన పవన్.. పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు చిన్న చిన్న కేసుల్లో కూడా ఢిల్లీలో ఉన్న వారిని సైతం పట్టుకొచ్చారని మీడియా సభ్యులు గుర్తు చేయగా.. దీని గురించి సీఎం చంద్రబాబు గారితో, హోంమంత్రి అనిత గారితో చర్చిస్తానని పవన్ తెలిపారు.