English | Telugu

వైభవంగా ‘తెలుగువన్’ 24వ వార్షికోత్సవం!

తెలుగు ప్రజలకు నిరంతరాయంగా వినోదాన్ని, సమాచారాన్ని నిర్విరామంగా అందిస్తూ, తెలుగు ప్రజల ఆదరణను, ఆశీస్సులను అందుకుంటోంది తెలుగువన్. ఎంట్రప్రిన్యుర్ క్వాలిటీతోపాటు సృజనాత్మకత కూడా పుష్కలంగా వున్న కంఠంనేని రవిశంకర్ పాతికేళ్ళ క్రితం ‘ఆబ్జెక్ట్ వన్’ సంస్థని స్థాపించారు. ఆబ్జెక్ట్ వన్ సంస్థని స్థాపించిన ఒక ఏడాది తర్వాత తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ‘తెలుగువన్’. వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ రూపాల్లో తెలుగు ప్రజల ముందుకు వచ్చిన ‘తెలుగువన్’ భారతదేశంలో యూట్యూబ్‌తో కలసి ప్రయాణాన్ని ప్రారంభించిన తొలి సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌గా అభివృద్ధి చెందిన ‘తెలుగువన్’ మొత్తం 350 యూట్యూబ్ ఛానళ్ళతో అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది.

ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాలు.. సినీ ప్రముఖులకు బిరుదులు

అమెరికాలోని డల్లాస్ నగరంలో సుస్వర మ్యూజిక్ అకాడెమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ మీనాక్షి అనిపిండి. ఈ అకాడెమీ 21వ వార్షికోత్సవం ఆదివారం (మే 5న) ఘనంగా నిర్వహించారు. గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ నగరంలోని ప్రముఖులతో సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా పాల్గొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు శ్రీ గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల, శ్రీమతి శారద సింగిరెడ్డి, శ్రీ ప్రకాష్ రావు అతిధులుగా హాజరయ్యారు.