English | Telugu

ఆ అమ్మాయి ఫోటో పెట్టి తప్పుచేసిన నటి హేమ!

బెంగళూర్ రేవ్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం. ఈ పార్టీ వేడి ఇంకా చాలారలేదు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది..కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో ఒక బాంబు పేల్చింది.  "హేమ మా అసోసియేషన్ లో  లైఫ్ మెంబర్.  నరేష్ 'మా' అధ్యక్షుడిగా ఉన్న టైములో "మా" వాట్సాప్ గ్రూప్ లో జబర్ధస్త్ అమ్మాయి వర్ష ఫోటోను హేమ పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఎందుకు పెట్టారు అని అందరు అడిగేసరికి  హేమ వెంటనే  వర్ష ఫోటోను డిలీట్ చేసింది. ఎవరికో ఫోటో పంపబోయి గ్రూపులో వచ్చిందనే విషయాన్ని ఆ తర్వాత చెప్పింది. ఈ వాట్సాప్ గ్రూపు మా వార్ రూమ్ లాంటిది.

వివాదంలో తెలంగాణ రాష్ట్ర గీతం.. కీరవాణిపై కళాకారుల ఆగ్రహం!

అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ...’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందెశ్రీ రచించిన ఆ గీతానికి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవడాన్ని ప్రస్తావించడమే కాదు, ప్రస్తుత ప్రభుత్వం ఆ గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి అప్పగించడంపై అసోసియేషన్‌ తమ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన ప్రకటన సారాంశం ఇలా ఉంది.