English | Telugu

‘యుఐ’ రెగ్యులర్‌ మూవీ కాదు... ఆడియన్స్‌ షాక్‌ అవుతారు!

సూపర్‌స్టార్‌ ఉపేంద్ర మచ్‌ ఎవైటెడ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఎక్సట్రావగంజా ‘యుఐ ది మూవీ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్‌, జి మనోహరన్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ కెపి శ్రీకాంత్‌ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్‌ మనోహరన్‌ సహా నిర్మాత. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. సెన్సేషనల్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌ తో ఈ హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం డిసెంబర్‌ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్‌  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. స్టార్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్‌ కే ఎన్‌ అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. 

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ఇండస్ట్రీకి కృతజ్ఞతలు. ఇండియానే కాదు.. వరల్డ్‌ నే షేక్‌ చేస్తుంది టాలీవుడ్‌. 1000 కోట్లు, 2000 కోట్లు సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కొడుతున్నారు. అయినప్పటికీ ఒక చిన్న టాలెంట్‌ ని చూసి కూడా గొప్పగా ఆదరిస్తున్నారు. దానికి నేనే నిదర్శనం. మీ ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారి ఉప్పెన సినిమా చూసి షాక్‌ అయ్యాను. ఆయన ఫస్ట్‌ సినిమాల అనిపించలేదు. రామ్‌ చరణ్‌ గారితో నెక్స్ట్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు. ఐ విష్‌ హిం ఆల్‌ ద వెరీ బెస్ట్‌. బేబీ సినిమా నాకు చాలా నచ్చింది. అలాంటి ఆలోచన దర్శక నిర్మాతలకు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోయాను. నిర్మాత ఎస్‌ కే ఎన్‌ గారికి ఆల్‌ ది వెరీ బెస్ట్‌. వారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్‌ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను 20 ఏళ్ల క్రితం చేసిన సినిమాల్ని ఇంకా గుర్తుపెట్టుకుని నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలని తపన కలుగుతుంది. ఈ గొప్పతనం అంతా ప్రేక్షకులదే.  నిర్మాత కె.పి శ్రీకాంత్‌ గారికి ఈ సినిమా ఐడియా చెప్పాను.  ఆయన లహరి లాంటి గొప్ప సంస్థని తీసుకొచ్చారు. ఇలా అందరూ కలిసి ఈ సినిమాని ఒక అద్భుతంగా మార్చారు. ఇది రెగ్యులర్‌ ఫిల్మ్‌ లాగా ఉండదు. ఒక కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్‌ చేస్తారు. ఇది ఒక ఇమేజినరీ వరల్డ్‌ లా ఉంటుంది’ అన్నారు. 

డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ..ఉపేంద్రగారికి నేను బిగ్‌ ఫ్యాన్‌ని. ఆయన్ని చూడడానికి ఈ వేడుక వచ్చాను. ఉపేంద్ర, ఓం, ఏ.. ఈ సినిమాలన్నీ చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. మేము చదువుకునేటప్పుడు ఆయన పేరు చెప్తే అమ్మాయిలు భయపడేవారు, అబ్బాయిలు నవ్వేవారు అది ఆయన టాలెంట్‌(నవ్వుతూ) ఉపేంద్ర సినిమా చూసినప్పుడు వన్‌ మినిట్‌ స్క్రీన్‌ బ్లాక్‌ అవుతుంది. ప్రొజెక్టర్‌ ఆగిపోయిందా అనే అనుమానం వచ్చి వెనక్కి చూస్తాం. కానీ అక్కడికి సినిమా స్టార్ట్‌ చేసి మళ్లీ కథ చెప్పడం మొదలు పెడతారు. ఇలాంటి ప్రయోగాలు ఉపేంద్రగారు ఎన్నో చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు. 

ప్రొడ్యూసర్‌ ఎస్‌ కే ఎన్‌ మాట్లాడుతూ.. ఉపేంద్ర గారి ఫంక్షన్‌ లో ఆయన ఎదురుగా మాట్లాడడం ఒక ప్రివిలేజ్‌ గా భావిస్తున్నాను. సౌత్‌ ఇండియాలో మాకు తెలిసిన కల్ట్‌ సినిమా, కల్ట్‌ హీరో, కల్ట్‌ పర్సనాలిటీ ఉపేంద్ర గారు. ఆయన ఆలోచనలకే మేము బిగ్‌ ఫాన్స్‌. ఆయన సినిమాని ఏ భాషలో చూసినా అందరూ ఫిదా అయిపోతారు. చందు గారు, మనోహర్‌ గారు చాలా పాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌. లహరి అంటే ఒక బ్రాండ్‌. వారు ఫిలిం మేకింగ్‌ లోకి వచ్చి పాన్‌ ఇండియా సినిమాల్ని ప్రొడ్యూస్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌ చూసినప్పుడు అందరూ ఒక అరటి పండు కోసం కొట్టుకుంటున్నారు. అక్కడే ఉపేంద్ర గారు తన స్టాంప్‌ వేశారు. ఇప్పుడు ఇండియా ని సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్స్‌ రూల్‌ చేస్తున్నాయి. ఈ సినిమా మన గీత ఆర్ట్స్‌ నుంచే రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమాని అందరూ డిసెంబర్‌ 20న చూసి ఘనవిజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఉపేంద్ర గారి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 

నిర్మాత అంబికా రామచంద్రరావు మాట్లాడుతూ.. మా సంస్థ ద్వారానే ఉపేంద్ర గారిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇవివి సత్యనారాయణ గారి డైరెక్షన్లో కన్యాదానం సినిమాతో తెలుగు ఆడియన్స్‌ ఆయన పరిచయమయ్యారు. ఆ సినిమాతో చాలా దగ్గర అయ్యారు. ఉపేంద్ర గారి ఇచ్చిన అవకాశంతో ఉపేంద్ర సినిమాని తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేసాం. ఆ రోజుల్లోనే సినిమా తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోయింది.  దాదాపు 13 సెంటర్లో 50 రోజులు ఆడిరది.  ఒక కన్నడ సినిమా ఆ రోజుల్లో 50 రోజులు  తెలుగులో ఆడటం చాలా గ్రేట్‌.  కన్యాదానం వంద రోజులు కంప్లీట్‌ చేసుకున్న సినిమాగా నిలిచింది.  అలాగే ఒకే మాట సినిమాకి కూడా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఉపేంద్ర గారు అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌ లానే ఉంటారు. ఆయన చాలా మంచి హ్యూమన్‌ బీయింగ్‌.  గుర్తుండిపోయే హీరో క్యారెక్టరైజేషన్‌ కి ఆయన పెట్టింది పేరు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్‌ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .గీత ఆర్ట్స్‌ ద్వారా తెలుగులో సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇక్కడ కూడా పెద్ద విజయం సాధిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. 

హీరోయిన్‌ రేష్మ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఉపేంద్ర గారు యుఐ సినిమాతో ఒక మాస్టర్‌ పీస్‌ క్రియేట్‌ చేశారు. డిసెంబర్‌ 20న అది మనమందరం విట్నెస్‌ చేయబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్‌ గా ఎదురు చూస్తున్నాను. ఇది నా ఫస్ట్‌ పాన్‌ ఇండియా రిలీజ్‌. తెలుగు ఆడియన్స్‌ కి ఈ సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ దక్కుతుందని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన లహరి ఫిలిమ్స్‌ కి ఉపేంద్ర గారికి థాంక్యూ సో మచ్‌ డిసెంబర్‌20 థియేటర్స్‌ లో కలుద్దాం’ అన్నారు 

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తులసిరాం మాట్లాడుతూ.. లహరి సంస్థని ఎంతగానో ప్రోత్సహించిన మీడియాకి, ఆడియన్స్‌ కి అందరికీ థాంక్యూ సో మచ్‌. ఉపేంద్ర గారితో మాది 20 ఇయర్స్‌ జర్నీ.  ఏ సినిమా ఆడియో లహరి లాంచ్‌ చేసింది. ఉపేంద్ర గారు మాకు ఫ్యామిలీ. 9 ఏళ్ల తర్వాత ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమా ఇది. ఈ సినిమా అహర్నిశలు కష్టపడ్డారు.ఉపేంద్ర గారు కంటెంట్‌ కింగ్‌. ఇందులో తొమ్మిది సీన్లు చూశాను. అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని అప్పుడే డిసైడ్‌ చేసుకున్నాను. ఈ సినిమా కన్నడ తెలుగు తమిళ్‌ మలయాళం హిందీ ఐదు భాషల్లో రిలీజ్‌ అవుతుంది.  తప్పకుండా మీరంతా చూడండి. ఇండియన్‌ స్క్రీన్‌ లో ఇది సెన్సేషనల్‌ మూవీ కాబోతుంది’అన్నారు. 

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చంద్రు మనోహరన్‌.. అందరికీ నమస్కారం.  లహరి సినిమాలో ఉపేంద్ర గారు ఒక సినిమాని డైరెక్ట్‌ చేయడం నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. డిసెంబర్‌ 20న ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్‌ అల్లు అరవింద్‌ గారు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. అల్లు అరవింద్‌ గారికి థాంక్యూ సో మచ్‌. ఉపేంద్ర గారి అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా ఉంటుంది’అన్నారు. 

కో ప్రొడ్యూసర్‌ నవీన్‌ మనోహరన్‌ మాట్లాడుతూ.. ఈవెంట్‌ కి వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్‌. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేసాం. ఉపేంద్ర గారి విజన్‌ ని స్క్రీన్‌ పైకి తీసుకొచ్చాము. ఈ సినిమా క్రెడిట్‌ అంతా ఉపేంద్ర గారికి దక్కుతుంది. థాంక్యూ.’అన్నారు. 

డైలాగ్‌ రైటర్‌ పార్థసారథి మాట్లాడుతూ.. ఈ సినిమాకి డైలాగ్‌ రాసే అవకాశం వచ్చింది. అలాగే ఈ సినిమాకి నేను అసోసియేట్‌ డైరెక్టర్ని. ఉపేంద్ర గారికి నేను బిగ్‌ ఫ్యాన్‌ ని. ఉపేంద్ర గారితో ఈ సినిమాకి రెండున్నర ఏళ్ళు క్లోజ్‌ గా పనిచేసే అవకాశం వచ్చింది. నిర్మాతలకి థాంక్యూ సో మచ్‌. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఉపేంద్ర గారికి థాంక్యూ.  నాకు చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఉపేంద్ర గారు చాలా స్పెషల్‌. ఈ సినిమా ఆడియన్స్‌ కి బెస్ట్‌ ఎక్స్పీరియన్స్‌ ఇస్తుంది’ అన్నారు. 

లిరిక్‌ రైటర్‌ రాంబాబు గోసాల మాట్లాడుతూ.. నేను ఉపేంద్ర గారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాకి అన్ని పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజ్నీస్‌ లోక్నాథ్‌ గారికి కి థాంక్యూ. ఈ సినిమాలో ట్రోల్‌ సాంగు ఆల్రెడీ వైరల్‌ అయింది. ఆస్కార్‌ విన్నర్‌ చంద్రబోస్‌ గారికి ఈ పాట చాలా నచ్చి నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు. ఇందులో నాది పెద్దది నీది చిన్నది అనే సాంగ్‌ రాబోతుంది. అది ఇంకా వైరల్‌ కాబోతుంది. ఇంతకుముందు అర్జున్‌ రెడ్డి, కాంతార సినిమాలకి రాశాను. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాకి అన్ని పాటలు రాశాను.  ఈ సినిమా వాటికి మించి నాకు పేరు తీసుకొస్తుందని నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఉపేంద్ర గారికి మా నిర్మాతలకి ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద హిట్‌ కాబోతోంది’ అన్నారు. సినిమా యూనిట్‌ అంతా పాల్గొన్న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది.