English | Telugu

హరికథ వెబ్ సిరీస్ రివ్యూ

అరకులో ఓ చిన్నపిల్లాడు దారుణంగా హత్యలు చేసాడంటూ కోర్టులో ప్రెజెంట్ చేయగా.. అతనిని బాల నేరస్తుల జైలుకి పంపమని కోర్టు తీర్పు ఇస్తుంది. ఇక దారిలో వస్తుండగా ఆ బాలుడు ఓ కానిస్టేబుల్ ని అతిదారణంగా చంపేస్తాడు. మరోవైపు అరకులో రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) బృందం నాటకాలు ఆడుతూ ఉంటారు. ఆయన దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కోరోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన ఏ అవతారం గురించి అయితే నాటకాన్ని ప్రదర్శించాడో, ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటారు. ఆ ఊరికి చెందిన వ్యక్తులు అలా దారుణంగా చంపబడుతూ ఉండటం అందరిలో భయాన్ని కలిగిస్తుంది.  అక్కడ భరత్ (అర్జున్ అంబటి) పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అతనికి స్వాతితో పెళ్లి కుదురుతుంది. ఆ సమయంలోనే విశాఖ నుంచి అతని స్నేహితుడు (శ్రీరామ్) అక్కడికి వస్తాడు.