English | Telugu

నువ్వు మగాడివిరా బుజ్జి 

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం వలనే  తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని,తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి  వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు, అనంతరం కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తు కోర్టు తీర్పుని ఇచ్చింది.దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ  జైలుకి తరలించారు.

ఇక ఈ మొత్తం ప్రాసెస్ లో, అంటే జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి అరెస్ట్ చెయ్యడానికి  పోలీసులు వచ్చినప్పట్నుంచి, తిరిగి వాళ్ళతో స్టేషన్ కి వెళ్లే వరకు అల్లు అర్జున్ ముఖంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆందోళన కనిపించలేదు.పోలీసులతో వెళ్తున్నప్పుడు తన భార్య స్నేహ రెడ్డికి కూడా  దైర్యం చెప్పిన అల్లు అర్జున్, ఆ తర్వాత స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్లి ఆ తర్వాత శిక్ష విధించారని తెలిసినా కూడా అల్లు అర్జున్ ముఖంలో చిరునవ్వు ఏ మాత్రం తగ్గలేదు 

దీంతో ఇప్పుడు అల్లు అర్జున్(allu arjun)ఫ్యాన్స్ అందరు కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు గతంతో పాటు ప్రెజంట్ కూడా చాలా మంది సినీసెలబ్రటీస్ పోలీసులు రాగానే వాదన చెయ్యడం, మీతో నేను ఎందుకు రావాలని వాదన చెయ్యడం లాంటివి చేస్తుంటారు.కానీ మా అల్లుఅర్జున్ మాత్రం ఎలాంటి వాదన చెయ్యకుండా పోలీసులకి సహకరించాడు.మా అల్లు అర్జున్ మగాడంటూ ట్వీట్ చేస్తున్నారు.