English | Telugu

అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఫ్యాన్స్ ఖుషి 

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం వలనే  తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని,తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి  వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు,అనంతరం కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తు కోర్టు తీర్పుని ఇచ్చింది.దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ  జైలుకి తరలించారు.

ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తరఫు లాయర్లు క్యాష్ పిటిషన్ వెయ్యడం జరిగింది.దీంతో  అల్లు అర్జున్ కి    హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.దీంతో మరికాసేపట్లో చంచల్ గూడ జైలు నుండి 
అల్లు అర్జున్ విడుదల కానున్నాడు.దీంతో అయన అభిమనుల్లో జోష్ వచ్చినట్లయింది.