హృతిక్ కొత్త గాళ్‌ఫ్రెండ్ ఇదివరకు మరొకరితో సహజీవనంలో ఉంది!
బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఇటీవల సబా అజాద్ అనే అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపించి, వార్తల్లో నిలిచాడు. ఆమెతో అతను రిలేషన్షిప్లో ఉన్నాడా, లేదా అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూశారు. సబాతో హృతిక్ డిన్నర్ డేట్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారడమే కాకుండా, ఆ ఇద్దరూ చేయీ చేయీ కలిపి పట్టుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.