Read more!

English | Telugu

స‌ల్మాన్ ఫామ్‌హౌస్‌లో ఫిల్మ్ స్టార్ల శ‌వాల‌ను పాతిపెట్టారా?

 

ముంబై శివార్ల‌లోని ప‌న్‌వేల్‌లో ఉన్న స‌ల్మాన్‌ఖాన్ ఫామ్‌హౌస్‌కు ద‌గ్గ‌ర ఆస్తి వివాదం తీవ్ర‌త‌ర‌మైంది. ఆ ఫామ్‌హౌస్ పొరుగున ఉండే కేత‌న్ క‌క్క‌డ్ అనే వ్య‌క్తి స‌ల్మాన్ ఫామ్‌హౌస్‌లో సినీ తార‌ల శ‌వాల‌ను ఖ‌న‌నం చేశార‌నీ, అక్క‌డ బాల‌ల అక్ర‌మ ర‌వాణా వంటివి కూడా చోటు చేసుకుంటున్నాయ‌ని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే కాకుండా కొన్ని ఇంట‌ర్వ్యూల్లోనూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. దీంతో అత‌నిపై ప‌రువున‌ష్టం దావా వేశాడు స‌ల్మాన్ ఖాన్‌.

Also read: "న‌న్ను పెళ్లాడ‌తావా?" అమీషాకు ప్ర‌పోజ్ చేసిన కాంగ్రెస్ లీడ‌ర్ త‌న‌యుడు!

కేవ‌లం స‌ల్మాన్ కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం వాటిల్ల‌జేసే ఉద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకుండా కేత‌న్ అలాంటి ఆరోప‌ణ‌లు చేశాడ‌ని స‌ల్మాన్ లాయ‌ర్ ప్ర‌దీప్ గాంధీ చెప్పారు. వీడియోలు, పోస్టులు, ట్వీట్ల రూపంలో త‌ప్పుడు, నిరాధార‌, ప‌రువున‌ష్ట ఆరోప‌ణ‌లు చేయ‌కుండా నిరోధించాల‌ని కోరుతూ కేత‌న్ క‌క్క‌డ్‌పై షార్ట్ కాజ్ సివిల్ కేసును స‌ల్మాన్ దాఖ‌లు చేశాడు. త‌మ మ‌ధ్య ఆస్తి త‌గాదాలో భాగంగా అర్పిత ఫామ్స్ ప‌క్క‌నే ఉన్న త‌న స్థ‌లానికి వెళ్లే మార్గాన్ని స‌ల్మాన్ మూసేశాడ‌ని కూడా కేత‌న్ ఆరోపించాడు. అయితే దీన్ని స‌ల్మాన్ లాయ‌ర్ ఖండించారు.

Also read: పాము కాటుకు గురైన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్

త‌న సోద‌రి అర్పిత పేరు మీద నిర్మించిన విలాస‌వంత‌మైన ప‌న్‌వేల్ ఫామ్‌హౌస్‌లో ప్ర‌తి ఏటా త‌న బ‌ర్త్‌డేని స‌ల్మాన్ సెల‌బ్రేట్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. 2020లో కొవిడ్ ఫ‌స్ట్ లాక్‌డౌన్ కాలంలో త‌న క్లోజ్ ఫ్రెండ్స్‌, కుటుంబ స‌భ్యుల‌తో చాలా రోజులు ఈ ఫామ్‌హౌస్‌లోనే గ‌డిపాడు.