English | Telugu

శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్

శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా యువ నిర్మాత గణేష్ సినిమా ఒక సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా గణేష్ సినిమాకి దర్శకుడెవరనేది మొన్నటి వరకూ సస్పెన్స్ లో ఉంది. ప్రస్తుతం ఆ సస్పెన్స్ కు తెరపడింది. ప్రముఖ యువదర్శకుడు శ్రీను వైట్ల ఈ యన్ టి ఆర్ హీరోగా గణేష్ నిర్మించబోయే మూవీకి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా గణేష్ నిర్మించే సినిమాకి దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన కథ హీరో యన్ టి ఆర్ కి బాగా నచ్చిందని తెలిసింది. యన్ టి ఆర్ హీరోగా గణేష్ నిర్మించబోతున్న ఈ ఫిలిం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది.

థియేటర్లలో యన్ టి ఆర్ మ్యారేజ్

థియేటర్లలో యన్ టి ఆర్ మ్యారేజ్ లైవ్ ఇవ్వనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ మ్యారేజ్ నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణీతతో మే నెల అయిదో తేదీన జరుగ నుంది. ఈ యన్ టి ఆర్ మ్యారేజ్ ని నార్నేశ్రీనివాస రావు తమ సొంతఛానల్ "స్టుడియో N" లో లైవ్ టెలికాస్ట్ చేయాలని సంకల్పించగా, అందుకు యన్ టి ఆర్ అభ్యంతరం తెలిపినట్లు ఫిలిం నగర్ వాసుల ద్వారా సమాచారం. "స్టుడియో N" న్యూస్ ఛానల్ అనీ, అందులో కాకుండా ఏదైనా ఎంటర్ టైన్ మెంట్ ఛానల్లో అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉండి, తన పెళ్ళి అందరూ చూసేందుకు వీలుగా ఉంటుందనే అభిప్రాయంతో యన్ టి ఆర్ ఉన్నట్లు సమాచారం.

నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్

నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తూంది. వివరాల్లోకి వెళితే గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన యువ హీరో నితిన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఇటీవల గోవాలో హీరో నితిన్ పైన ఒక పాటను చిత్రీకరించుకుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "ఇష్క్" అన్న పేరుని నిర్ణయించారు. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా ఎన్నికయ్యింది. కేరళ నుంచి వచ్చిన నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రంతో తెలుగు చలన చిత్ర రంగానికి హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి చిత్రంతోనే నిత్య మీనన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులను ఆకట్టుకుంది.