English | Telugu

నాగచైతన్య ఆటోనగర్ సూర్య లొకేషన్ సెర్చ్

నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" లొకేషన్ సెర్చ్ లో ఉంది. ఈ నాగచైతన్య ఆటోనగర్ సూర్య చిత్రానికి సంబంధించి అవసరమైన లోకేషన్ల కోసం ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా వెతుకుతున్నాడు. నాగచైతన్య ఆటోనగర్ సూర్య లొకేషన్ సెర్చ్ కోసం దర్శకుడు దేవకట్టా విజయవాడ, గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను పరిశీలిస్తున్నారు. దేవకట్టా దర్శకత్వంలో, నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" చిత్రం షూటింగ్ అక్కడే జరుగనుంది.

నాగచైతన్య ప్రస్తుతం కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ దర్శకత్వంలో, డి శివప్రసాదరెడ్డి నిర్మించే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా గతంలో "వెన్నెల". "ప్రస్థానం" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగచైతన్య నటిస్తున్న ఈ "ఆటోనగర్ సూర్య" చిత్రం దర్శకుడిగా దేవకట్టాకి హేట్రిక్ చిత్రమవుతుంది. "ఏప్రెల్" నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకుంటుందని తెలిసింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.