Read more!

English | Telugu

మంచు మనోజ్ సరసన శ్రియ

మంచు మనోజ్ సరసన శ్రియ హీరోయిన్ గా నటించబోతోంది. వివరాల్లోకి వెళితే యువ హీరో మంచు మనోజ్ కుమార్ హీరోగా, అనిల్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై, దమ్మాలపాటి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రంలో అందాల నటి శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించనుంది. మంచు మనోజ్ సరసన శ్రియ నటిస్తున్న తోలి చిత్రం ఇదే కావటం గమనార్హం.

 

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మించబడిన "శివాజీ" ది బాస్ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించింది. తర్వాత, రవితేజ హీరోగా నటించగా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన "డాన్ శీను" చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ప్రస్తుతం మంచు మనోజ్ కుమార్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తూంది.

 

ఈ చిత్రంలో శ్రియ పాత్ర రొటీన్ కు భిన్నంగా ఉంటుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న మంచు మనోజ్ కుమార్ కూడా ఈ చిత్రంలోని తన పాత్ర నచ్చే ఈ చిత్రంలో హీరోగా నటించటానికి అంగీకరించాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది.