English | Telugu

Illu illalu pillalu : కొడుకుల దగ్గర మాటతీసుకున్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -08 లో....భద్రవతి మేనకోడలు ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది. ఏంటి ప్రేమ అసలు చెయ్యి కూడా పట్టుకొనివ్వవు.. నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ప్రేమిస్తున్నాను కాని ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉందని ప్రేమ అంటుంది. అప్పుడే రామరాజు చిన్న కొడుకు ధీరజ్ (చిన్నోడు). వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కి వస్తాడు.‌ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా.. నువ్వు నాకు శత్రువు కని నీ గురించి చెప్తున్నా.. వాడు పెద్ద వెస్ట్ గాడు అని కళ్యాణ్ గురించి ప్రేమకి చెప్తాడు ధీరజ్.

ట్విస్ట్ లతో దూసుకెళ్తున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -258 లొ.....సీతాకాంత్ స్నానం చేసి వచ్చేవరకు రామలక్ష్మి డ్రెస్ తో రెడీగా ఉంటుంది. దాంతో నాకు వద్దంటూ చిరాకు పడతాడు. ఇదంతా మీ కోసమే చేస్తున్నానని మీకు ఎప్పుడు అర్ధం అవుతుందని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు కిచెన్ లో వంట చేస్తుంటారు. త్వరగా చెయ్యండి మా అయన వచ్చే టైమ్ అయిందని రామలక్ష్మి అంటుంది. నేను చెయ్యనని శ్రీలత అనగానే.. ఆస్తులు వద్దా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది రామలక్ష్మి.

బిఆర్ఎస్ నేత హరీష్ రావుతో రాకింగ్ రాకేష్

కమెడియన్ రాకింగ్ రాకేష్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. ఐతే ఇప్పుడు తనే హీరోగా, నిర్మాతగా కెసిఆర్ ...కేశవ చంద్ర రమావత్  అనే సినిమా చేశాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది.ఈ నేపథ్యంలో రాకేష్- సుజాత కలిసి తమ బిడ్డతో హరీష్ రావు దగ్గర వెళ్లారు. అక్కడ హరీష్ రావుకు ఈ మూవీ గురించి రాకేష్ ఎక్స్ప్లైన్ చేస్తూ ఉన్నాడు. చరిత్రలో కెసిఆర్ మూవీ ఒక భాగం కాబోతోంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్న రాకేష్ కి కంగ్రాట్యులేషన్స్ అంటూ  హరీష్ రావు చెప్పారు. అలాగే ఈ మొయివే హిట్ కొట్టాలంటూ హరీష్ రావు రాకేష్ కి విషెస్ చెప్పారు.

Illu illalu pillalu : ప్రేమ పెళ్ళి చేసుకోవద్దని కొడుకుల దగ్గర మాట తీసుకున్న తండ్రి! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -07 లో....రామరాజు పెద్ద కొడుకు చందు గుడికి వచ్చి.. తన లవర్ సుభద్రకి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు గుడిలో కలిసి మాట్లాడుకుంటారు. రామరాజు వస్తాడేమోనని చందు భయపడతాడు. మన పెళ్లి విషయం గురించి ఇంట్లో మాట్లాడావా అంటూ సుభద్ర అడుగుతుంది. దాంతో చందు భయపడుతాడు. ఆ తర్వాత వేదవతి వంట చేస్తున్న వాసనా వచ్చి.. వాళ్ళ అమ్మ చిన్న పిల్లని కూర తీసుకొని రా అని పంపిస్తుంది దాంతో వేదవతి తన తల్లికి కర్రీ వేసి పంపిస్తుంది.

Karthika Deepam2 : శివన్నారాయణ‌కి ఎదురుతిరిగిన దీప.. భర్త కోసం తెగించేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -206 లో.. దీపని కార్తీక్ రెస్టారెంట్ కి తీసుకొని వచ్చి.. మెనూలో ఉప్మా బిర్యానీ రిసీపీనీ ఆడ్ చేస్తాడు. ఉప్మా బిర్యానీ రెసిపీ గురించి దీపని షెఫ్ కి చెప్పమంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా రెస్టారెంట్ కి వస్తుంది. అక్కడున్న మేనేజర్ తో మాట్లాడుతుంది. మెనూ ఎవరు చేంజ్ చేశారని జ్యోత్స్న అడుగగా.. కార్తీక్ సర్ పెట్టారు.. కార్తీక్ సర్ తన భార్య దీప మేడమ్ తో వచ్చారని  మేనేజర్ అనగానే.. అతని చెంప చెల్లుమనిపిస్తుంది.