English | Telugu

మెగా ఛీఫ్ రేస్ నుండి నబీల్ అవుట్.. 

 

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ ముగియగానే హౌస్ లో కంటెండర్ షిప్ కోసం టాస్క్ ఇచ్చాడు. ఇక ఇందులో ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ప్లే చేశారు‌. అయితే నబీల్ గేమ్ స్ట్రాటజీ అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే హౌస్ లో గెలవాలంటే అందరి సపోర్ట్ అవసరం. ఇండివిడ్యువల్ గా ప్లే చేస్తే నిలవడం గెలవడం రెండు కష్టమే.

ఇక బిగ్ బాస్ ఈ సీజన్‌కి చివరి మెగా చీఫ్ అయ్యేందుకు టాస్క్ గురించి చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో అప్పుడప్పుడు ఒక్కొక్కరి పేరు మీద టీ షర్ట్ లోపలికి వస్తుంది.. దాన్ని ఎండ్ బజర్ మోగే వరకూ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి.. అనంతరం అక్కడ ఉన్న బొమ్మకి ధరింపజేయాలి.. అలా చేసినవాళ్లు మెగా చీఫ్ కంటెండర్లు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలా ఐదుగురికి మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు బిగ్ బాస్.

ఇక బజర్ మ్రోగగానే ప్రేరణ టీ షర్ట్ రాగా పోటీ పడి మరీ యష్మీ, పృథ్వీ చించిపారేశారు. అలానే గౌతమ్‌ది రాగానే నబీల్ ఆవేశంగా ఆ టీషర్ట్‌ను చించేశాడు. గౌతమ్‌ని పృథ్వీ, నిఖిల్ ఇద్దరూ హోల్డ్ చేయడంతో గౌతమ్ టీ షర్ట్ ని నబీల్ చించేశాడు. అయితే ఇలా వచ్చిన ప్రతి ఒక్కరి టీ షర్ట్‌ను చించేందుకు నబీల్ ట్రై చేశాడు. ఒక్క పృథ్వీ, యష్మీలది మాత్రమే కాపాడాడు నబీల్. కాసేపటికి నబీల్ టీ షర్ట్ రాగానే గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ, రోహిణి అందరూ చించేందుకు ట్రై చేశారు. నబీల్‌ని గౌతమ్ గట్టిగా పట్టుకొని వదల్లేదు.. దీంతో మిగిలిన పని రోహిణి, ప్రేరణ కలిసి నబీల్ టీ షర్ట్ ని చించేశారు. దాంతో నబీల్  కంటెండర్ రేస్ నుండి అవుట్ అయ్యాడు. సింగిల్‌గా ఆడమని మొన్నటి నామినేషన్ లో మణికంఠ చెప్పిన తర్వాత నబీల్ చాలా ఇండివిడ్యూవల్‌గా ఉండటం స్టార్ట్ చేశాడు. గేమ్‌లో కూడా ఎవరినీ సాయం అడగలేదు.. దీంతో మొదటికే మోసం వచ్చి కంటెండర్ రేసు నుంచే నబీల్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ వారం మెగా చీఫ్ కంటెండర్లుగా పృథ్వీ, యష్మీ, విష్ణుపియ, టేస్టీ తేజ, రోహిణి అయ్యారు.