'బజార్ రౌడీ'గా మారిన బర్నింగ్ స్టార్!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రేక్షకుల్ని మరోసారి నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. అతను హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు 'బజార్ రౌడీ' అనే టైటిల్ అనౌన్స్ చేశారు. బుధవారం టైటిల్ డిజైన్, ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. వసంత నాగేశ్వరరావు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కె.ఎస్. క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.