English | Telugu
పవన్‌కల్యాణ్-క్రిష్ సినిమా కోసం 17వ సెంచరీ చార్మినార్!
Updated : Feb 9, 2021
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 27వ సినిమా కోసం ఛార్మినార్ సెట్‌ను నిర్మిస్తున్నారు. అయితే అది ఇప్పడు కనిపిస్తోన్న చార్మినార్ కాదు. 17వ శతాబ్దం నాటి చార్మినార్ మోడల్. అంటే దీన్ని బట్టి ఈ సినిమా కథ 17వ శతాబ్దం నేపథ్యంలో జరుగుతోందన్న మాట. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ ఖర్చుతో ఈ చార్మినార్ సెట్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నిర్మిస్తోంది. ఈ సెట్‌లో ఓ లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. కథలో చార్మినార్ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. అక్కడ భారీ యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని క్రిష్ రూపొందిస్తున్నాడు.
పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేసిన ప్రి లుక్‌కు వచ్చిన స్పందన తెలిసిందే. ముఖం కనిపించకుండా కేవలం నడుము మీద చేయిపెట్టుకున్న పవన్ కల్యాణ్ లుక్ ఫ్యాన్స్‌ను వెర్రెత్తించింది. అందులో పవన్ నడుముకు కట్టిన రెడ్ క్లాత్‌కు గోల్డ్ కలర్ ఈగిల్ పెండెంట్ కనిపిస్తోంది. గత ఏడాదే ఈ సినిమాకు సంబంధించి 15 రోజుల షూటింగ్ నిర్వహించారు. "పవన్ కల్యాణ్ గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.." అంటూ పవన్ బర్త్‌డేకి క్రిష్ చేసిన ట్వీట్ కూడా ఫ్యాన్స్‌ను బాగా ఖుషీ చేసింది.
పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానున్నది.