English | Telugu
అంచనాలకు మించిన 'ఉప్పెన' బిజినెస్!
Updated : Feb 9, 2021
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫిల్మ్ 'ఉప్పెన' అంచనాలను మించి ప్రి బిజినెస్ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబా సానా డైరెక్టర్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ పాపులర్ కావడం, ప్రత్యేకించి "నీ కన్ను నీలిసముద్రం" సాంగ్ సూపర్ హిట్ కావడం, విజయ్ సేతుపతి పాపులారిటీ, కృతి శెట్టి అందచందాలు, ట్రైలర్ తీసుకొచ్చిన క్రేజ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఉప్పెన' థియేట్రికల్ రైట్స్ రూ. 19 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.
నైజాం రైట్స్ రూ. 6 కోట్లు, ఆంధ్రా హక్కులు రూ. 10 కోట్లు, రాయలసీమ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్‌లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడుకావడం ఇండస్ట్రీ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి. విడుదలకు ముందే 'ఉప్పెన' టేబుల్ ప్రాఫిట్ తీసుకురావడాన్ని ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు.
కోస్తా తీరంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ ధనిక కాలేజీ అమ్మాయికీ మధ్య మొదలైన ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది, పరువు కోసం ఎంతటి ఘోరానికైనా వెనుకాడని వ్యక్తి తన కూతురి ప్రేమపై ఎలా స్పందించాడు, ఏం చేశాడనేది 'ఉప్పెన'లోని ప్రధానాంశం. దేవి శ్రీ మ్యూజిక్, షామ్‌దత్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ ఎస్సెట్స్‌గా నిలుస్తున్నాయి.