English | Telugu
నయనతార కూతురితో నాగ్ రొమాన్స్?
Updated : Feb 9, 2021
కింగ్ నాగార్జున తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా రిలీజయ్యేలోపే 'గరుడవేగ' కెప్టెన్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ సినిమాని పట్టాలెక్కించబోతున్నారు నాగ్. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం.. కథానుసారం విదేశాల్లోనే సింహభాగం చిత్రీకరణ జరుపుకుంటుందని వినికిడి.
ఇదిలా ఉంటే.. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ్ కి జోడీగా అనిఖ సురేంద్రన్ నటించబోతోందని టాక్. ఈ అనిఖ మరెవరో కాదు.. తమిళ అనువాద చిత్రం 'విశ్వాసమ్'లో అజిత్, నయనతార గారాలపట్టిగా నటించిన అమ్మాయే. అంతేకాదు.. 'విశ్వాసమ్' కంటే ముందు మలయాళ చిత్రం 'భాస్కర్ ది రాస్కెల్'లోనూ నయన్ కి కూతురిగా నటించింది అనిఖ. తాజాగా అనిఖపై లుక్ టెస్ట్ నిర్వహించి.. నాగ్ సరసన నాయికగా కన్ఫామ్ చేశారట ప్రవీణ్. త్వరలోనే నాగ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీలో అనిఖ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. బాలనటిగా ఇంప్రెస్ చేసిన అనిఖ.. కథానాయికగానూ అలరిస్తుందేమో చూడాలి.