English | Telugu

Bigg Boss 9 Telugu: మాస్క్ మ్యాన్  వర్సెస్ ఇమ్మాన్యుయల్


బిగ్ బాస్ సీజన్-9 చాలా గ్రాంఢ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో తొమ్మిది మంది సెలెబ్రిటీలు ఉండగా, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. ఇక ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీస్ అని బిగ్ బాస్ ముందుగానే చెప్పారు.

ఇక ప్రతీ సీజన్ లో ఎలాగో అలాగే కంటెస్టెంట్స్ ఫుడ్ కోసం తిప్పలు పడుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కామనర్స్ కి మాత్రమే కిచెన్ అని బిగ్ బాస్ చెప్పడంతో సెలెబ్రిటీలు ఫుడ్ లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ సెలెబ్రిటీల కోసం ఫుడ్ పంపించాడు. ఇకనుండి ప్రతీరోజు నేనే మీకు ఫుడ్ పంపిస్తానని సెలెబ్రిటీలతో బిగ్ బాస్ చెప్పడంతో అందరు ఫుల్ హ్యాపీ అయ్యారు. బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పారు. ఇక వీరితో పాటు కామనర్స్ కి కూడా కొన్ని వెరైటీలు పంపించాడు‌ బిగ్ బాస్.‌ ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్ తో కామెడీ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. గార్డెన్ లో ఎంత చెత్తుంది.. అది క్లీన్ చేయడానికి ఎంత టైమ్ పడుతుందని ఇమ్మాన్యుయల్ ని బిగ్ బాస్ అడుగగా..‌చాలా టైమ్ పడుతుందని చెప్పాడు. అయితే బిగ్ బాస్ మాత్రం ఓ మెలిక పెట్టాడు. అది క్లీన్ చేయడానికి ఎంత టైమ్ పడుతుందో‌ మీ మానిటర్(మాస్క్ మెన్ హరీష్) చెప్తాడని బిగ్ బాస్ చెప్పాడు. చెప్పండి గుండు అంకుల్ అని ఇమ్మాన్యుయల్ అనగానే కామనర్స్ తో పాటు సెలెబ్రిటీలు ఫక్కున నవ్వేసారు. అది మాస్క్ మెన్ హరీష్ విని కాస్త సీరియస్ అయ్యాడు.

కాస్త చూసి చెప్పండి అని ఇమ్మాన్యుయల్ అనగా మీరు చూసి మాట్లాడండి అని హరీష్ అన్నాడు. గుండు ఏంటి అంకుల్ ఏంటి బాడీ షేమింగ్ వద్దు అని హరీష్ అనగా.. నేను అలా అనలేదు.. సారీ అంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. అలా అయితే నేను కూడా ఏదో ఒకటి మాట్లాడేసి సారీ చెప్పనా.. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవల్ దాటకూడదంటూ హరీష్ వాదించాడు. మీ మూడ్‌ని బట్టి మనుషులుండరని ఇమ్మూ అంటే మీ మూడ్ బట్టి మేముండాలా ఏంటి అంటూ మాటకి మాట ఇచ్చిపడేశాడు హరీష్. మా మూడ్‌ని బట్టి కూడా మిమ్మల్ని ఉండమనట్లే అని ఇమ్మాన్యుయల్ చెబుతుంటే లిమిట్.. అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు. ఇలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతుంటే భరణి మధ్యలో వచ్చి ఆపాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలిచింది. హౌస్ లో ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి.


Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.