పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా 'ఆదిత్య 999'.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేయనున్నారు.