English | Telugu

విడాకులకు రెడీ అవుతున్న మరో హీరోయిన్‌.. కారణం అదే!

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనిలో వివాహ బంధానికి కొంత మినహాయింపు ఉండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి ఏమీ లేవని అర్థమవుతోంది. పెళ్లి, ఆ తర్వాత విడాకులు అనేది ఎంతో సహజమైన ప్రక్రియ అన్నట్టుగా యువతీయువకులు బిహేవ్‌ చేస్తున్నారు. ఇటీవలికాలంలో సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా ధోరణి బాగా ఎక్కువైందని చెప్పొచ్చు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఏ వయసు వారైనా విడాకులకు సిద్ధమైపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలోని వారు పెళ్లి పెళ్లి చేసుకున్నా మళ్లీ విడిపోతారుగా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 20 సంవత్సరాలకు పైగా వైవాహిక జీవితంలో ఉన్న వారు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తాజాగా నటి సంగీత కూడా విడాకుల రూట్‌లోనే వెళుతోందని తెలుస్తోంది. 1977లో ఇండస్ట్రీకి వచ్చిన సంగీత.. తెలుగుతోపాటు తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేశారు. అయితే ఆమెకు హీరోయిన్‌గా అంత గుర్తింపు రాలేదు. 2002లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఖడ్గం చిత్రంలో సంగీత చేసిన సీతామహాలక్ష్మీ క్యారెక్టర్‌ ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. పెళ్లాం ఊరెళితె, శివపుత్రుడు, టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌, ఖుషీఖుషీగా, సంక్రాంతి వంటి సినిమాల్లో ఆమె చేసిన క్యారెక్టర్లకు నటిగా మంచి గుర్తింపు లభించింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే తమిళ గాయకుడు క్రిష్‌ను వివాహం చేసుకుంది. అందరు హీరోయిన్లలాగే పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చింది సంగీత. కొన్నాళ్ళ క్రితం సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

ఇదిలా ఉంటే.. సంగీత విడాకులు తీసుకోబోతోందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఆ కారణంగానే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వినిపస్తున్నాయి. వార్త నిజమేనన్నట్టుగా సంగీత తన సోషల్‌ మీడియా అకౌంట్‌ పేరు మార్చింది. అంతకుముందు సంగీత క్రిష్‌గా ఉన్న తన పేరు ఇప్పుడు సంగీత యాక్ట్‌గా కనిపిస్తోంది. దాంతో ఈ దంపతులు విడిపోతున్నారనే న్యూస్‌ వైరల్‌గా మారింది. ఈమధ్యకాలంలో విడిపోవాలనుకుంటున్న సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక హింట్‌ ఇవ్వడం పరిపాటిగా మారింది. సంగీత కూడా దాన్నే ఫాలో అవుతోంది. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తపై సంగీతగానీ, క్రిష్‌గానీ స్పందించలేదు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా లేదా అనే విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.