కొరటాల శివకు హీరో దొరికేశాడు.. దేవర-2 లేనట్టేనా?
'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. అలాంటి కొరటాలకు మొదటిసారి 'ఆచార్య' రూపంలో ఘోర పరాజయం ఎదురైంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన గత చిత్రం 'దేవర' కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ, దర్శకుడిగా కొరటాలకు మాత్రం పేరు తీసుకురాలేదు. దీంతో 'దేవర-2' ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.