అప్పుడే ఓటీటీలోకి కూలీ మూవీ..!
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.