సీఎం అయినా, పీఎం అయినా ఒకటే.. జైలు కెడితే పదవి ఊస్ట్.. లోక్ సభలో బిల్లు
తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే, వారు ఆటోమేటిగ్గా పదవి కోల్పోతారు.