English | Telugu

ఇండియా కూటమి నేతల భేటీ.. ఏజెండా ఏంటంటే?

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కీలక నేతల భేటీ బుధవారం (ఆగస్టు 20) జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనున్న ఈ భేటీలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొంటారు.

కూటమిలోని అన్ని పార్టీల మద్దతు సమీకరణ, ఎన్నిక వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురువారం ( ఆగస్టు 21) నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి కూటమి పార్టీల నేతలు హాజరౌతారు.