English | Telugu

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై గురువారం (ఆగస్టు 20) ఉదయం దాడి జరిగింది. ఒక ఫిర్యాదుదారుడిగా జన్ సున్వాయ్ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి ఏకంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అహ్మద్ పాషాగా గుర్తించారు.

అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. అయితే దాడికి కారణం, నిందితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తనపై జరిగిన దాడి యత్నాన్ని సీఎం రేఖా గుప్తా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇటువంటి దాడులకు తాను బెదిరేది లేదని స్పష్టం చేశారు.