Bigg boss 9 Telugu : నాలుగో వారం కెప్టెన్ గా రాము రాథోడ్!
బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ కంటెండర్స్ గా రాము, రీతూ, ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. మిగతా హౌస్ మేట్స్ బజర్ మోగినప్పుడు ఎవరు ముందు వెళ్లి గంట కొడతారో వాళ్ళు రేన్(Rain) డ్యాన్స్ చేయాలి. ఆ లోపు కంటెండర్స్ ఒక టేబుల్ ని దానికి సంబంధించిన బాక్స్ లో సెట్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే రేన్(Rain) డ్యాన్స్ చేసే వాళ్ళు కంటెడర్స్ నుండి ఒకరిని రేస్ నుండి తొలగించాలి.