English | Telugu

Illu illalu pillalu : చందు నిజం చెప్పేస్తాడేమోనని హార్ట్ ఎటాక్ డ్రామా ఆడిన భాగ్యం దంపతులు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -282 లో.... శ్రీవల్లిని ప్రేమ ఒక ఆట అడేసుకుంటుంది. గాజు పెంకులపై డ్యాన్స్ చేయిస్తుంది. దాంతో ప్రేమ అంటే శ్రీవల్లికి భయం వేస్తుంది. మరుసటి రోజు శ్రీవల్లి కాలికి గాజు పెంకులు గుజ్జుకున్నాయని ఏడుస్తుంటే నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఆ తర్వాత ప్రేమ నిద్ర లేచి.. రాత్రి జరిగింది గుర్తుచేసుకుంటుంది. ధీరజ్ వచ్చి నా డ్రెస్ ఎక్కడ అని అడుగుతాడు. నాకేం తెలుసు.. మీ ఐశ్వర్యకి తెలుసని వెటకారంగా మాట్లాడుతుంది.