English | Telugu

Illu illalu pillalu : బతుకమ్మ పేర్చిన రామరాజు కోడళ్ళు.. కొడుకులకి అగ్నిపరీక్షే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -284 లో.....ధీరజ్, నేను ముద్దు పెట్టుకున్నామో లేదో అన్న కన్ఫ్యూషన్ ఉంది అక్క నువ్వు ధీరజ్ ని అడుగు అక్క అని నర్మదని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ధీరజ్ వస్తుంటే నర్మద ఆపి మాట్లాడుతుంది. ప్రేమ చాటు నుండి అంతా వింటుంది. నిన్న బ్యాచిలర్ పార్టీలో ఏదో అయిందంట కదా అని అడుగుతుంది. ఏం అయింది పార్టీ బాగా జరిగిందని ధీరజ్ అంటాడు. ప్రేమ వింటున్న విషయం ధీరజ్ చూస్తాడు. దాంతో ఏమో వదిన కరెంటు పోయింది. నాకేం తెలియదని ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

Brahmamudi : రాజ్ కి విడాకులు ఇస్తానన్న కావ్య.. అప్పు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -846 లో..... అప్పు డల్ గా ఉండడంతో ధాన్యలక్ష్మిని రుద్రాణి తీసుకొని వచ్చి .. నీ కోడలు చూడు ఎలా ఉందో.. దీనికి కారణం ఆ కావ్య.. ఇలా ఉంటే పుట్టే బిడ్డపై ఎఫెక్ట్ కలుగుతుందని రుద్రాణి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. కళ్యాణ్ ని పిలిచి అప్పుని అలా బయటకు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ సరే అంటాడు. అప్పు దగ్గరికి వచ్చి బయటకు వెళదాం.. అమ్మ నిన్ను ఇలా చూసినట్లు ఉంది.. అందుకే బయటకు తీసుకొని వెళ్ళు అంది అనగానే అప్పు సరే అంటుంది.

పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు

జబర్దస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ గా శ్రీదేవి విజయ్ కుమార్, కృష్ణ భగవాన్ వచ్చారు. ఇక నూకరాజు, కొమరక్కా ఇద్దరూ కలిసి ఒక స్కిట్ వేశారు. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు. "మిడిల్ క్లాస్ అంటే ఏమిటి" అని కొమరక్కా అడిగేసరికి " పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు" అంటూ నూకరాజు చెప్పారు. "పైసలు తక్కువున్నప్పుడు పిల్లలెందుకు ఎక్కువ" అని అడిగింది. "రిచ్ పర్సన్..పని తప్ప వేరే కోరిక ఉండదు. మిడిల్ క్లాస్. కోరికలు తప్ప పనులే ఉండవు" అని చెప్పాడు. ఇక రాంప్రసాద్, సున్ని కలిసి వేసిన స్కిట్ లో బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాడు. "మన బెస్ట్ ఫ్రెండ్ ఏరా మనం నాశనమైపోవాలని కోరుకుంటాడు ఫస్ట్" అన్నాడు రాంప్రసాద్. "అదేంట్రా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వేగా" అన్నాడు సున్ని. "నీకు మందు అలవాటు చేసింది. నీ కెరీర్ డల్ కావడానికి కారణం ఎవరు" అనేసరికి "నువ్వు" అన్నాడు సన్నీ. "ఇప్పుడు నేనేమవుతాను" అన్నాడు రాంప్రసాద్.

శ్రీముఖి అసలైన రాధికా...డిజె టిల్లు కౌంటర్

జీ కుటుంబం 2025 అవార్డ్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ ప్రోమోలో "తెలుసు కదా" మూవీ టీమ్ నుంచి సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా వచ్చారు. అలాగే సీరియల్స్ నుంచి కొంతమంది లేడీ యాక్టర్స్ కూడా వచ్చారు. డిజె టిల్లు మూవీలో రాధికా రోల్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఈ అవార్డ్స్ ఈవెంట్ కూడా రాధికా రోల్ మీదనే నడిచింది. ఈ షోకి హోస్ట్స్ గా ప్రదీప్, శ్రీముఖి ఉన్నారు.  "మా ప్రతీ సీరియల్ లోనూ ఒక రాధికా ఉంటుంది" అని ప్రదీప్ అనేసరికి. "రాధికా లైఫ్ లోనే ఉంటుంది సర్" అన్నాడు సిద్దు. "నాకు లైఫ్ అప్పుడప్పుడు రాధికలా ఉంటుంది" అన్నాడు ప్రదీప్. "ఇప్పుడు మీ ముందుకు కొంతమందిని ప్రెజెంట్ చేస్తాను. వాళ్లలో రాధికా ఎవరో చెప్పాలి" అన్నాడు ప్రదీప్. "మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డ్రెస్సింగ్ ని బట్టి రాధికా తెలిసిపోతుంది" అంటూ శ్రీముఖి చెప్పింది. "నీ గోల ఏంటి మధ్యలో.." అంటూ శ్రీముఖి మీద సిద్దు సెటైర్స్ వేసాడు.

సింగపూర్ లో  కీర్తి సురేష్ క్రైమ్ స్టోరీ...

జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి మోడరన్ మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక జగపతి బాబు మీదనే కీర్తి ఫుల్ సెటైర్స్ వేసింది. "నువ్వు మహానటివి అని తెలుసు...బయట పెద్ద మహానటివి" అనేసరికి "మీకు మహానాటీ" అంటూ కన్ను కొట్టి సరదాగా మాట్లాడింది కీర్తి సురేష్. "స్కూల్ లో ఎలా ఉండేదానివి" అనేసరికి "ఉందా మీ దగ్గర ఫోటో" అని అడిగింది. "అదిగో" అంటూ కీర్తి స్కూల్ ఫోటో చూపించారు. "పాకెట్ మనీ నీకు ఇచ్చేవాళ్ళా నువ్వు జేబులోంచి కొట్టేసేదానివా" అని అడిగారు. "జేబులోంచి తియ్యడం..ఆ సంతోషమే వేరు" అని చెప్పేసరికి జగపతి బాబు పగలబడి నవ్వారు.