Brahmamudi: రాహుల్ కన్నింగ్.. కావ్యకి రాజ్ ఆయుర్వేద చికిత్స చేపిస్తాడా!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -891 లో....అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. గుడికి అని అప్పు చెప్తుంది. కళ్యాణ్ దగ్గరున్న బ్యాగ్ చూసి అదేంటని అడుగుతుంది. దాంతో ఇద్దరు కలిసి ఏదో ఒకటి కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు. మేనేజర్ ఎక్కడ అని శృతిని రాజ్ అడుగుతాడు. అయన రిజైన్ చేసి రాహుల్ సర్ కంపెనీకి వెళ్ళిపోయాడని శృతి చెప్పగానే రాజ్, కావ్య షాక్ అవుతారు.