సీరియల్ లో గ్లామర్ లేదని వచ్చా..ఫ్యామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉండదు
పవిత్ర ఈ మధ్య ఫ్యామిలీ స్టార్స్ కి వచ్చిన అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఈ షోకి వచ్చిన స్టార్స్ ని రోస్ట్ చేసింది. రకరకాల ప్రశ్నలు అడిగి సెటైర్స్, కౌంటర్లు వేసి నవ్వించింది. ఇక ఈ షోకి వచ్చిన సమీర్ ని, సుహాసినిని కొన్ని ప్రశ్నలు వేసింది. "సమీర్ గారు మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అడగాలనిపిస్తోంది" అంటూ పాగల్ పవిత్ర ఒక ప్రశ్న అడిగింది. "సారీ నేను ఆ టైపు కాదు" అంటూ సమీర్ సీరియస్ ఫేస్ తో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "ఐతే ఈయన్ని అడగండి" అంటూ సుధీర్ వైపు చూపించాడు సమీర్. "ఆయన వేరే టైపు" అంటూ పవిత్ర డైలాగ్ వేసింది. "మీకు రెండే రెండు అప్షన్స్ ఇస్తాను. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఆలోచించి చేసుకోండి. భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు" అంటూ కొంచెం కామెడీ డైలాగ్స్ వేసేసరికి సమీర్ నవ్వేసాడు
.