English | Telugu
నన్ను చంపాలని చూసారు.. అందుకు కారణం వాళ్ళకి తెలుసు
Updated : Nov 13, 2025
-ఆదాశర్మ ని చంపాలని చూసింది ఎవరు!
- ఆ రెండు చిత్రాల విశిష్టత ఏంటి
-ది కేరళ స్టోరీ ఎప్పుడు వచ్చింది
- బస్తర్ కథ ఏంటి
అందం, అభినయం కలగలిపిన నటీమణుల లిస్ట్ లో 'ఆదాశర్మ'(Adah sharma)కూడా ఖచ్చితంగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పై ఆ స్థాయిలో పెర్ ఫార్మెన్సు ని చూపగలదు. వర్సటైల్ దర్శకుడు 'పూరి జగన్నాధ్' దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది. ఆ చిత్రంలో హయతి అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి యువకుల హృదయాల్లో గిలిగింతలు రేపింది. ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేసినా హిట్ కాలేదు. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసిన కొన్ని చిత్రాలు మాత్రం సక్సెస్ అయ్యాయి. వాటిల్లో ఆమె మొదటి చిత్రం 1920 ,బస్టర్ ది నక్సల్ స్టోరీ(Bastar The Naxal Story), ది కేరళ స్టోరీ(The Kerala Story).ఈ మూడు చిత్రాలు హిందీలో తెరకెక్కినవే. పైగా ప్రధాన క్యారక్టర్ లో కనపడి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సదరు క్యారెక్టర్స్ ఎంతో రిస్క్ తో కూడా కూడుకున్నవి.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆదాశర్మ సదరు చిత్రాల గురించి తన అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతు రిస్క్ ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పుడే కెరీర్ కి మరింత విలువ పెరుగుతుంది. 1920 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఆ చిత్రం ఒప్పుకోవడమే పెద్ద సాహసం. ది కేరళ స్టోరీ తర్వాత నా కెరీర్ మారిపోయింది. మంచి కథలు నా దగ్గరకి రావడం స్టార్ట్ చేసాయి. బస్తర్ కి, ది కేరళ స్టోరీ రిలీజ్ అయినప్పుడు ఎన్నో బెదిరింపులు వచ్చాయి.దేశం లో సగం మంది నన్ను చంపాలని అనుకున్నారు. మిగతా సగం మంది నన్ను ప్రశంసించారు. ఒక రకంగా వాళ్లంతా నన్ను రక్షించినట్లే అని ఆదాశర్మ చెప్పుకొచ్చింది.
also read: సద్బ్రాహ్మణుడైన సత్య ప్రకాష్ భయపెట్టే విలన్ గా ఎలా మారాడు!
ఆదా శర్మ చెప్పినట్టుగానే ఆ రెండు చిత్రాలు వచ్చినప్పుడు కొంత మంది నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే చాలా ఏరియాల్లో నిరసన జ్వాలల్ని వెళ్ళగక్కాయి. అదాశర్మ కేరళ స్టోరీ లో హిందూ యువతీ. కానీ ముస్లిమ్ వ్యక్తిని పెళ్లి చేసుకొని మతాన్ని మార్చుకుంటుంది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులని ఎదురుకుంటుంది. ఆదాశర్మ నటన కూడా సదరు క్యారక్టర్ లో పతాక స్థాయిలో ఉంటుంది. ఇక బస్టర్ లో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ నక్సలైట్ గా మారి సమాజాన్ని ప్రశ్నించే క్యారక్టర్ లో కనపడింది.