English | Telugu
డిజె టిల్లు ట్వీట్ వైరల్.. బిగ్గెస్ట్ స్పాయిలర్
Updated : Nov 13, 2025
-డిజె ట్వీట్ వైరల్
-అసలు ట్వీట్ లో ఏముంది!
- తెలుసు కదా ఓటిటి లోకి రెడీ
ఒరిజినల్ పేరుతో కాకుండా తన హిట్ సినిమాలోని క్యారక్టర్ పేరుతో అభిమానులు,ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక అరుదైన హీరో 'డిజె టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ'(Siddhu Jonnalagadda).గత నెల 17 న 'తెలుసు కదా'(Telusu kada)అనే మూవీతో థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా టిల్లు సరసన రాశి ఖన్నా(Raashii Khanna)శ్రీనిధి శెట్టి(Srindhi Shetty)జంటగా కనిపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి వేదికగా సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికార ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్ గా స్ట్రీమింగ్ విషయంపై టిల్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ లో 'చిల్డ్రెన్స్ డే రోజున 'తెలుసు కదా'స్ట్రీమింగ్ కి తీసుకురావడం పెద్ద స్పాయిలర్ అని మెన్షన్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ టిల్లు అభిమానుల్లో వైరల్ గా మారింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆదరణ నోచుకోని తెలుసు కదా ఓటిటి లో ఏ మేర అదరణని అందుకుంటుందో చూడాలి.
also read: నన్ను చంపాలని చూసారు..అందుకు కారణం వాళ్ళకి తెలుసు
'తెలుసు కదా' ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)నిర్మించగా నీరజా కోన(Neeraja Kona)దర్శకత్వం వహించింది. అగ్ర టెక్నీషీయన్స్ అందరు 'తెలుసు కదా' కి వర్క్ చేశారు. సరికొత్త కథ, కథనాల విషయంలో మాత్రం మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు.