English | Telugu

కొండా సురేఖపై కేసు విషయంలో నాగర్జున కీలక నిర్ణయం!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో.. ఈ కేసు విషయంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు.

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ.. గతేడాది అక్టోబర్ లో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అందరూ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఇక నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతకాలంగా నాంపల్లి స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.

Also Read: కాంత మూవీ ఫస్ట్ రివ్యూ

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా.. అక్కినేని కుటుంబం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెబుతూ కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు.

కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో తాజాగా ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు నాగార్జున. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.