Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉంది.. రామ్ ఖాతాలో హిట్ పడిందా..?
చాక్లెట్ బాయ్ గా, ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన ఇమేజ్ కి భిన్నంగా గత కొన్నేళ్లుగా ఎక్కువగా మాస్ సినిమాలు చేసి, పరాజయాలను చూశాడు. దీంతో ఇప్పుడు రూట్ మార్చి, యూత్ కి నచ్చే 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమా చేశాడు. పైగా, ఇది ఒక అభిమాని బయోపిక్ గా అందరి హీరోల అభిమానులకు కనెక్ట్ అయ్యే కథతో రూపొందింది.