English | Telugu

చిరంజీవి కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్.. ఇప్పటికీ అదే మాట మీద కీర్తి సురేష్!

స్టార్స్ లో గొప్ప డ్యాన్సర్ ఎవరంటే ఎక్కువమంది టక్కున చెప్పే పేరు.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). అలాంటిది హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం.. చిరంజీవి కన్నా విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో కీర్తి సురేష్ తీరుని తెలుగు సినీ అభిమానులు తప్పుబట్టారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ వివాదంపై కీర్తి స్పందించింది. అంతేకాదు, ఇప్పటికీ ఆమె తన కామెంట్స్ ని సమర్ధించుకోవడం విశేషం. (Keerthy Suresh)

కీర్తి సురేష్ నటించిన 'రివాల్వర్ రీటా'(Revolver Rita) మూవీ నవంబర్ 28న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. మీడియా నుండి 'చిరంజీవి కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్ అనడం ఎంతవరకు కరెక్ట్?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి ఊహించని సమాధానం ఇచ్చింది.

"చిరంజీవి గారు లెజెండ్. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఆయన ఒకరు. చిరంజీవి గారిని నేనెంతో గౌరవిస్తాను. అయితే నేను విజయ్ గారికి వీరాభిమానిని అనే విషయం చిరంజీవి గారికి కూడా తెలుసు. ఫేవరెట్ యాక్టర్, ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరని మేము సరదాగా మాట్లాడుకున్నప్పుడు కూడా.. నేను విజయ్ గారి పేరే చెప్పాను. దానిని చిరంజీవి గారు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. పైగా, నేను నిజాయితీగా చెప్పానని ప్రశంసించారు కూడా. విజయ్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరు చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో చిరంజీవి గారి అభిమానులను బాధపెట్టి ఉంటే క్షమించండి" అని కీర్తి చెప్పుకొచ్చింది.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .