English | Telugu

రష్మీకి ప్రపోజ్ చేసిన నాటీ నరేష్.. అడ్డుపడుతున్న ఆది, రాంప్రసాద్!

రోజా ఇచ్చి మెప్పించాలనిపిస్తుంది... చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలనిపిస్తుంది...టెడ్డి బేర్ తో కలిసి లోకమంతా చుట్టేయాలనిపించే ఆశలు, కోరికలని నింపుకుని వచ్చే ఒకే ఒక్క నెల ఫిబ్రవరి. 14 వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. బుల్లితెర కూడా ఇప్పుడు ఆ వాలెంటైన్స్ డేని నేపథ్యంగా షోస్ ని తీసుకొస్తోంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ రాబోతోంది. తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో మూడు లవ్ స్టోరీస్ కన్పించాయి. పృథ్వీ శెట్టి - విష్ణు ప్రియా వచ్చారు. ఇది వాలెంటైన్స్ వీక్ కదా నాకు టెడ్డి బేర్ గిఫ్ట్ గా ఇస్తావా..దాన్ని హగ్ చేసుకుని పడుకోవడం ఇష్టం అనేసరికి నేను ఎందుకు టెడ్డి బేర్ లా పుట్టలేదు అంటాడు పృథ్వీ. దానికి విష్ణుప్రియ తెగ సిగ్గుపడిపోతుంది. తర్వాత రష్మీ ఒక పిక్ చూపించి మా విష్ణు బరువు బాధ్యతలు మోయడానికి రెడీనా అనేసరికి విష్ణుని వీపు మీద కూర్చోబెట్టుకుని ఫోజ్ ఇచ్చాడు. తర్వాత పృథ్వీకి పట్టిన చెమటలు విష్ణు తుడిచింది.

తర్వాత నాటీ నరేష్ ఇంద్రజ దగ్గరకు వెళ్లి తన లవ్ స్టోరీ చెప్పుకున్నాడు. "ఆ గాలోడు ప్రపోజ్ చేసిన అమ్మాయికి నేను కూడా ప్రపోజ్ చేశానమ్మా నాలుగేళ్ల నుంచి. ఏడు పదుల వయసు అని ముందే చెప్పావమ్మా ఐనా వినకుండా దాన్నే ప్రేమించాను.. పట్టుకునేటప్పుడే గులాబీనే పట్టుకున్నాను. పట్టుకున్నాకే తెలిసింది ఆ గులాబీ కింద రెండు ముళ్ళు ఉన్నాయని. అదే ఆది, రాంప్రసాద్. వాళ్ళు నన్ను గుచ్చుతున్నారమ్మా" అంటూ ఏడుస్తూ చెప్పుకున్నాడు. తర్వాత ఢీ 10 రాజు వచ్చి తన లవ్ బ్రేకప్ గురించి చెప్పాడు. ఇప్పుడు ప్యాచప్ అవ్వాలన్నా ఆమెకు వేరే పర్సన్ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.