English | Telugu

Eto Vellipoyindhi Manasu : అక్కడ భద్రాన్ని చూసి సీతాకాంత్ షాక్.. పాష్ గా రెడీ అయిన శ్రీవల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -303 లో.... సీతాకాంత్, రామలక్ష్మి ల దగ్గరికి సన్నీ వస్తుంది. మీరు చేసిన ప్రోగ్రామ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేద్దామని అంటుంది. దాంతో రెడీ అయి వస్తామని సీతాకాంత్ అంటాడు కానీ ఈ లైవ్ ప్రోగ్రాం రోజులో ఒక అరగంట మాత్రమే ఉంటుందని చెప్పు సన్నీ అని రామలక్ష్మి చెప్పగానే.. ఎందుకలా అని సీతాకాంత్ అడుగుతాడు. రోజు అంత ఇలా లైవ్ చేస్తూ వాళ్ళకి సమాధానం చెప్తుంటే వాల్యూ ఉండదు.. పైగా టైమ్ పాస్ కి కూడా కాల్ చేస్తుంటారని రామలక్ష్మి అంటుంది.

Karthika Deepam2: నిజం తెలిసి జ్యోత్స్నని ఉతికారేసిన దీప.. అంతా వినేసిన దాస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం-2. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-254లో.. నా సాయం మీరు తీసుకోవాల్సిందే.. మీ కష్టం నేను చూడలేనంటూ జ్యోత్స్న తెలివిగా మాట్లాడి.. కారు మీద వెళ్లిపోతుంది. అప్పుటికే కార్తీక్‌ని బాగా కోపంగా ఉంటుంది. జ్యోత్స్నలో ఇంత మార్పేంటని దాసు అనుకుంటాడు. ఇంతలో బావా.. బండి కాలడానికి కారణం అయిన వాళ్లను మాత్రం అసలు వదిలిపెట్టకూడదని కాశీ అంటాడు. వెంటనే కార్తీక్ రగిలిపోతూ.. టవల్ మెడలో వేసుకుని.. కాశీ నీ బండి తాళం ఇవ్వు అంటాడు. కాశీ ఇవ్వగానే.. బండి స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్లి.. దీపా.. కొన్నే కదా ఉన్నాయి.. అమ్మ అనసూయగారు అమ్ముతారులే..