English | Telugu
పొట్టి డ్రెస్ తెచ్చిన తంటా..భాస్కర్ కి క్లాస్ పీకేసిన లేడీస్!
Updated : Jan 16, 2025
బులెట్ భాస్కర్ కి ప్రియాంక జైన్ కి బాగా గొడవ జరిగింది. ఫామిలీ స్టార్స్ ఈ రాబోయే వీక్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ గొడవ కనిపిస్తుంది. దాంతో ప్రియాంక జైన్ కాస్తా స్టేజి మీద నుంచి కిందకి దిగి వెళ్ళిపోయింది. అసలేమయ్యిందో చూద్దాం. స్టేజి మీద షో మామూలుగానే జరుగుతూ ఉండగా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో ప్రియాంక స్టేజి మీదకు వచ్చింది. ఇక వెంటనే బులెట్ భాస్కర్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో డ్యూయెట్ సాంగ్ వచ్చేసరికి ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. ఐతే స్టెప్స్ వేసేవాడు కాస్తా ఆమెను రెండు చేతుల మీద ఎత్తి గిరగిరా తిప్పేసాడు. ఆ హఠాత్పరిణామానికి ప్రియాంక కూడా షాకయ్యింది.
వెంటనే ఆమెను దింపేసాడు భాస్కర్. "చూసుకోవచ్చు కదా డ్రెస్ బాలేదు, లిఫ్ట్ చేయొద్దు అని చెప్పాను కదా" అంది సీరియస్ గా. దానికి భాస్కర్ షాకయ్యాడు. "అదేదో ముందు చెప్పాలండి..వచ్చిన తర్వాత కంఫర్టబుల్ గా లేదు అంటే ఎలా ఉంటుంది" అన్నాడు రివర్స్ లో సీరియస్ గా. "లిఫ్ట్ చేస్తారని తెలీదు కదా మాకు" అంది ప్రియాంక. వాళ్ళ మాటలకు మధ్యలో పాగల్ పవిత్ర ఎంట్రీ ఇచ్చి..."నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. తన డ్రెస్ కంఫర్ట్ గా లేదు" అని చెప్పింది. ఇక లేడీస్ అందరూ తగులుకునేసరికి భాస్కర్ పరువు పోయింది అని భావించి ఎం మాట్లాడాలో అర్ధం కాక "వేసుకునే వాళ్లకు తెలుస్తుంది..చూసేవాళ్లకు ఎం తెలుస్తుంది కంఫర్ట్ గా ఉందో లేదో అని" అంటూ రివర్స్ లో ఆన్సర్ చెప్పాడు. ఆ మాటకు ప్రియాంక జైన్ సమాధానం చెప్పకుండా స్టేజి మీద నుంచి కిందకి దిగి వెళ్ళిపోయింది.