English | Telugu

Karthika Deepam2 : మూర్ఖుడిలా తాత.. ఛాలెంజ్ లతో మనవడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -249 లో..... సుమిత్ర అందరికి భోజనం వడ్డీస్తుంది. ఇవి అయిన ఇంట్లో చేసినవా లేక మళ్ళీ ఎక్కడ నుండి అయినా తెచ్చావా అని పారిజాతం అడుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుండి నా వంట తింటున్నారు.. తెలియడం లేదా అని సుమిత్ర అంటుంది. అంటే కొన్ని వంటలు ఆ దీప నువ్వు సేమ్ వండుతారని పారిజాతం అనగానే.. తనపై శివనారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో నేను ఒక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న చెప్పగానే.. ఏదైనా తీసుకో అది మనకు పేరు తెచ్చేదిగా ఉండాలని శివన్నారాయణ‌ అంటాడు.

Brahmamudi : సామంత్ కాలర్ పట్టుకున్న అనామిక.. వదిలేసిపోయిన ప్రియుడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -614 లో.. అనామికకి సెక్యూరిటీ ఫోన్ చేసి మీ దగ్గర ఉంది డుబ్లికేట్ కిరీటం, కావ్య మేడమ్ ఒరిజినల్ కిరీటం లాకర్ లో పెట్టి.. ఇప్పుడు తీసింది అనగానే అనామిక షాక్ అవుతుంది. అప్పుడే కావ్య వచ్చి సెక్యూరిటీ దగ్గర ఫోన్ లాక్కొని ఏంటి అనామిక షాక్ అయ్యావా అంటుంది. నీకు అంత తెలివి ఉంటే నాకు ఎంత ప్లాన్ ఉండాలని నీ ప్లాన్ నీకే తిప్పి కొట్టానని కావ్య మాట్లాడుతుంది. ఆ తర్వాత నిన్ను కొట్టొచ్చు పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కానీ అలా చెయ్యడం లేదు ఎందుకంటే నీకు ఫ్యామిలీ ఉందని, ఎక్కడికైనా వెళ్లి నిజాయితీగా పని చేసుకోమని సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది కావ్య.

ఫైమా కాళ్ళు పట్టుకున్న హైపర్ ఆది...

"ఈ సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ఒక షో త్వరలో సంక్రాంతి పండగకి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఈ షోకి సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమోలోనో షో మొత్తం చూపించేసారు మేకర్స్. ఇక హైపర్ ఆది మాత్రం ఎక్కడా తగ్గేదెలా అన్నట్టు చేసాడు. ట్రెండింగ్ లో ఉన్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ గెటప్ తో వచ్చి ఆడియన్స్ కి కనువిందు చేసాడు. అల్లు అర్జున్ లా ఆది నటిస్తే శ్రీవల్లి రోల్ లో ఫైమా చేసింది. ఆదిని సర్ప్రైజ్ చేయడానికి ఫైమా వెనక నుంచి వచ్చి సామి..అంటూ హగ్ చేసుకుంది. ఆ హగ్ కి ఆది షాకైపోయాడు. "నెలకోసారి నాలుగు ఈవెంట్లకు వెళ్లి బాగా అలవాటైపోయింది నీకు ఇలా అందరినీ హగ్ చేసుకోవడం" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక మూవీలో  పుష్ప రాజ్ శ్రీవల్లి కాళ్ళను మూవీలో పట్టుకోవడం చూసాం. ఆది అదే ఇక్కడి షోలో దించేసాడు.

Brahmamudi : కిరిటాన్ని మార్చేసిన కావ్య.. డెమో పీస్ అంటూ కొత్త ప్లాన్ రివీల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -613 లో.... రాజ్ ని నిద్రలేపడానికి వస్తుంది కావ్య. దాంతో తన మీద పడిపోతుంది. కావ్య రొమాంటిక్ గా రాజ్ ని చూసేసరికి.. పదా ఆఫీస్ కి లేట్ అవుతుందంటూ కంగారుపడతాడు. మార్పు మొదలైంది ప్రేమ మొదలు అయిందని కావ్య మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య ఆఫీస్ కి బయల్దేర్తారు. దారిలో కావ్య ప్రెజెంటేషన్ ఫైల్ మర్చిపోయానని గుర్తుకు వచ్చి తీసుకొని రావడానికి కార్ దిగి ఆటోలో వెళ్తుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి కి వెళ్లి నగలన్నీ జగదీష్ చంద్ర ముందు పెట్టేస్తాడు.

Eto Vellipoyindhi Manasu : నిండా ముంచనున్న భద్రం.. సీతాకాంత్, రామలక్ష్మిలకి అడుగడుగునా అవమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -298 లో......సందీప్, ధనలు భద్రం చేసే ట్రాప్ లో ఈజీగా పడిపోతారు. ఈ వెంచర్ పూర్తి కాకుండానే మనం ఇంకొక వెంచర్ మొదలు పెట్టాలని భద్రం అంటాడు. ఇది ఇంకా కన్‌స్ట్రక్షన్ కాలేదు కదా అని సందీప్ అనగానే.. అది అయ్యేసరికి టైమ్ పడుతుంది. అంతసేపు ఖాళీగా ఉంటామా.. అందుకే ఈ లోపు ఇంకొకటి మొదలు పెట్టాలని భద్రం అంటాడు. దానికి వాళ్ళు కూడా సరే అంటారు. మనం కూడా ఇక కొత్త కంపెనీ పెట్టాలని ధన అంటాడు. మిమ్మల్ని మోసం చేసి ఈ డబ్బుతో పారిపోతానని భద్రం మనసులో అనుకుంటాడు.

నన్ను ట్రోలింగ్ చేయడం వల్లనే నా కెరీర్ నాశనమయ్యింది..

సయ్యద్ సోహైల్ రీసెంట్ గా కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు అక్కడ ఫుడ్ తినడానికి వెళ్లే వాళ్లంతా కూడా సోహైల్ చూసే అవకాశం వస్తోంది. ఐతే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ఒక పాయింట్ గురించి చెప్పుకొచ్చాడు. "నేను సినిమాలు చేస్తున్నానని బయటకు రాకూడదు అంటే అది జరగని పని. కంటెంట్ ఉంటే టికెట్స్ తెగుతాయి. నేనేమీ రోడ్డు మీద తిరగడం లేదు. నా రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకుంటున్నా. నా కోసం నేను చేసిన మూవీ కోసం సినిమా థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళ కోసం నేను రెస్టారెంట్ దగ్గర రిసీవ్ చేసుకోవడం తప్పేం లేదు కదా.

నిఖిల్ : మన దగ్గరకు రావాలని రాసి పెట్టి ఉంటే కచ్చితంగా వస్తుంది 

బిగ్ బాస్ సీజన్ 8 ఐపోయాక విన్నర్ నిఖిల్ బాగా ఆడిన పృద్వి బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ అలాగే ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు నిఖిల్. " బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను చేయలేనేమో అనుకున్నా..కానీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక నేను ఏదైనా చేయగలను అనుకున్నా. బిగ్ బాస్ కి ప్రజల ప్రేమ పొందడానికి  వెళ్లాను. చిన్నపిల్లలు కూడా నన్ను ప్రేమించడం చూస్తున్నా. అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అదృష్టం. నా ఒపీనియన్ లో లవ్ అంటే యాక్సెప్టెన్స్. ఎక్స్పెక్టేషన్స్ కన్నా యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంటే బెటర్. సోనియాకి మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పుష్ప మూవీ చూసా.