English | Telugu

ఆవిడ ఇస్తే గిఫ్టులు తీసుకుంటావ్ ..మన స్నేహం ఎన్నేళ్లో తెలుసా?

ఇద్దరు హోస్టులు ఒక షోలో కలిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు సర్కార్ షోలో కూడా అలాగే ఉంది. ఈ షోకి ఆల్రెడీ హోస్ట్ సుధీర్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ కి ప్రదీప్ కూడా వచ్చాడు. ప్రదీప్ ఆల్రెడీ సీనియర్ హోస్ట్ ఢీ డాన్స్ షోని ఎన్నో సీజన్స్ నిర్వహించాడు. అటు మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా కూకు విత్ జాతిరత్నాలు షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు గెస్ట్ గా సర్కార్ సీజన్ 5 కి వచ్చాడు. ఇక రాగానే సుధీర్ ని ఫుల్ గా ఏడిపించాడు. ప్రదీప్ స్టేజి మీదకు రాగానే అబ్బా ఎంత ఆనందం వచ్చింది అంటూ వెళ్లి సుధీర్ ని హగ్ చేసుకున్నాడు.

Jayam serial: గంగని క్షమించేసిన రుద్ర.. పైడిరాజుని చూసేసాడుగా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -14 లో......గంగ లేట్ గా నిద్ర పోతుంటే ఫస్ట్ డేనే డ్యూటీ కి లేట్ గా వెళ్తే ఎలా త్వరగా రెడీ అవ్వు అని గంగ వాళ్ల అమ్మ నిద్ర లేపుతుంది. త్వరగా లేచి ఇంట్లో పనులు చేసి సూపర్ మార్కెట్ కి బయలు దేర్తుంది. బస్సు లేట్ అవ్వడం.. ఇంకా ఆటో దొరకపోవడంతో గంగ సూపర్ మార్కెట్ లోకి లేట్ గా వెళ్తుంది. రుద్ర ఆల్రెడీ సూపర్ మార్కెట్ లో ఉంటాడు. ఎవరు లేట్ గా వచ్చిన లోపలికి రానివ్వొద్దని చెప్తాడు. దాంతో గంగ లేట్ గా రావడంతో తనని లోపలికి అనుమతించారు. అప్పుడే రుద్ర వాళ్ళ పెద్దనాన్న వచ్చి గంగని లోపలికి తీసుకొని వెళ్తాడు.

మనసిచ్చి చూడు సీరియల్ హీరో పెళ్లి ఫిక్స్...

"మా బోనాల జాతర" పేరుతో ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ మహేష్ - సాండ్రా. వీళ్ళ వీడింగ్ బెల్స్ ఈ స్టేజి మీద మోగాయి. మహేష్ "మనసిచ్చి చూడు" సీరియల్ లో ఆది రోల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇక ఈ ఎపిసోడ్ కి మహేష్ - సాండ్రా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. "మీకు అబ్బాయి నచ్చితే మహేష్ నా అల్లుడివి నువ్వే" అని చెప్పండి అంటూ సాండ్రా వాళ్ళ నాన్నకు చెప్పమని చెప్పింది శ్రీముఖి. "ఎప్పుడో చెప్పాను" అన్నారాయన..వెంటనే మహేష్ తనకు కాబోయే అమ్మాయి చేతులు పట్టుకుని  ధర్మేచా..అంటే ధర్మంగా నిన్ను బాధ్యతగా చూసుకుంటాను అని ప్రమాణం చేస్తున్నా అంటూ వెలికి ఉంగరం తొడిగాడు. మోక్షేచ్చ అంటే మోక్ష మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు సాండ్రా మహేష్ వెలికి ఉంగరం పెట్టింది. తర్వాత మహేష్ ఆమెను హగ్ చేసుకున్నాడు. "ఇప్పటివరకు నేను నీకు ప్రొపోజ్ చేయలేదు.