English | Telugu

ఓజీ స్టోరీ ఇదే.. పవర్ స్టార్ రేంజ్ కి ఇది సరిపోతుందా..?

సెప్టెంబర్ 25న 'ఓజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ అసలుసిసలైన సినిమా ఇదని, రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటిదాకా 'ఓజీ' నుంచి వచ్చిన కంటెంట్ కూడా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఇక ఇప్పుడు ఈ మూవీ స్టోరీ లైన్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది. (They Call Him OG)

ఇప్పటికే ఓవర్సీస్ లో 'ఓజీ' బుకింగ్స్ ఓపెన్ కాగా.. ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ కి ఓజీ సినాప్సిస్ పంపారు మేకర్స్. బుకింగ్ సైట్స్ లోనూ ఈ సినాప్సిస్ దర్శనమిస్తోంది. ఇప్పుడిది చదివి.. ఫ్యాన్స్ మరింతగా ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

"ముంబై అండర్ వరల్డ్ నుండి దశాబ్దం పాటు అదృశ్యమైన మాఫియా డాన్ ఓజాస్ గంభీర(పవన్ కళ్యాణ్).. ఈసారి మరింత పవర్ ఫుల్ గా, ఎవరూ ఆపలేని విధంగా తిరిగి వస్తాడు. ఓజాస్ గంభీర లక్ష్యం ఏంటంటే.. ప్రస్తుతం అండర్ వరల్డ్ ని శాసిస్తున్న నిరంకుశుడు ఓమి భావు( ఇమ్రాన్ హష్మీ)పై ప్రతీకారం తీర్చుకొని, తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందడం. ఈ క్రమంలో ఓజాస్ గంభీరకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. బెదిరింపులు, నమ్మక ద్రోహాలు ఎదుర్కొంటాడు. వీటిని ఎదుర్కొంటూ ఓజీ ఒక క్రూరమైన నేర యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తాడు." అనేది ఆ సినాప్సిస్ సారాంశం.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి ఇలాంటి కథ పడితే.. ప్రతి షాట్ ఒక ఎలివేషన్ లాగానే ఉంటుంది. అందుకే ఈ పవర్ ఫుల్ స్టోరీ లైన్ చదివి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అసలైన బాక్సాఫీస్ స్టామినా చూస్తారని ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .