English | Telugu

యాక్సిడెంట్ పై స్పందించిన కాజల్.. ఆ వార్త వెనక ఉంది వీళ్లే 

తెలుగు సినిమాపై కాజల్ అగర్వాల్(Kajal Aggarwal)ముద్ర చాలా ప్రత్యేకమైనది. గ్లామర్ క్యారెక్టర్స్ పోషించడానికే హీరోయిన్ ఉందనే మాటని చెరిపి వేసిన, అతి తక్కువ మంది హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. తెలుగుతో పాటు ఇతర భాషలకి చెందిన ఎన్నోచిత్రాల్లో అత్యద్భుతంగా నటించి తనకంటు ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంది. చందమామ, మగధీర, బృందావనం, ఆర్య 2 ,గణేష్, నాయక్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, వివేగం, ఖైదీ నెంబర్ 150 , బిజినెస్ మాన్, మెర్సిల్, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది.


కాజల్ యాక్సిడెంట్ కి గురయ్యినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలపై కాజల్ స్పందిస్తు నాకు ప్రమాదం జరిగిందనే వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆ వార్త విని నవ్వుకున్నాను. ఎందుకంటే ఇంత కంటే 'ఫన్నీ న్యూస్' మరొకటి ఉండదు. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను.ఎవరైతే ఈ రూమర్స్ సృషించారో వాళ్లందరికీ నాదొక విన్నపం. ఇలాంటి రూమర్స్ ని ప్రచారం చెయ్యకుండా, నిజమైన వార్తలని నలుగురితో పంచుకోండని ఎక్స్ వేదికగా తెలిపింది.

2020 లో 'గౌతమ్ కిచ్లు' అనే వ్యాపార వేత్తని కాజల్ పెళ్లి చేసుకోగా ఆ ఇద్దరికి ఒక బాబు ఉన్నాడు. వివాహ బంధంలో ఎంతో సంతోషంగా ఉన్న కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)తో భగవంత్ కేసరి లో చేసి తన సత్తా చాటింది. ఆ తర్వాత ప్రధాన పాత్రలో 'సత్యభామ' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇటీవల కన్నప్ప(Kannappa)లో 'పార్వతి దేవి' గా నటించి అభిమానుల, ప్రేక్షకుల నీరాజనాల్ని అందుకుంది.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.