English | Telugu

120 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఓటీటీలోకి వచ్చేసింది. అయినా థియేటర్లలో సందడి తగ్గలేదు!

సినిమా అంటే స్టార్లు ఉండాలి, భారీ సెట్టింగ్స్‌ ఉండాలి, భారీ బడ్జెట్‌తో నిర్మించాలి.. ప్రస్తుతం టాలీవుడ్‌ మేకర్స్‌ ఆలోచన ఇలాగే ఉంది. కానీ, కంటెంట్‌ బాగుంటే ఆ హంగులేవీ అక్కర్లేదని ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ప్రూవ్‌ చేస్తున్నాయి. కేవలం కంటెంట్‌నే నమ్ముకొని కొందరు యంగ్‌ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చేస్తున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలకు భారీగా ప్రమోషన్లు చెయ్యనవసరం లేదు. కేవలం మౌత్‌ టాక్‌తో థియేటర్లు నిండిపోతున్నాయి. యాక్షన్‌ సినిమాలు, ఫ్యాక్షన్‌ సినిమాలకు కాలం చెల్లిందని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి. గతంలో పరభాషా చిత్రాలు అనేవారు. ఇప్పుడు ఏ భాషలో నిర్మించిన సినిమా అయినా అన్ని భాషల్లోనూ రిలీజ్‌ అవుతున్నాయి. అందరూ ఆ సినిమాలను చూస్తున్నారు.

ఇటీవలికాలంలో విడుదలైన మహావతార్‌ నరసింహ, సు ఫ్రమ్‌ సో, కొత్తలోక, లిటిల్‌ హార్ట్స్‌ చిత్రాలు భారీ విజయాలు సాధించి స్టార్‌ హీరోలకు, డైరెక్టర్లకు సవాలు విసిరాయి. ఈ సినిమాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. వాటిలో సు ఫ్రమ్‌ సో ఒకటి. చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సు ఫ్రమ్‌ సో నిలిచింది. జూలై 25న విడుదలైన ఈ సినిమా 48 రోజులుగా థియేటర్లలో మంచి వసూళ్ళు రాబడుతోంది. త్వరలో ఓటీటీలోకి రాబోతోంది అంటూ చాలా ప్రకటనలు వచ్చాయి. అయినా ప్రేక్షకులు థియేటర్లలోనే ముందు చూసేస్తున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయినప్పటికీ కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి.

సు ఫ్రమ్‌ సో చిత్రం సాధించిన కలెక్షన్ల గురించి చెప్పాలంటే.. ఒకేరోజు 6 కోట్లు కలెక్ట్‌ చేసి ఈ సినిమా స్టామినా ఏమిటో చూపించింది. ఒక చిన్న సినిమాకి ఆ స్థాయి కలెక్షన్లు రావడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 122 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇందులో 15 కోట్లు ఓవర్సీస్‌ కలెక్షన్లు కూడా ఉన్నాయి. ఒక చిన్న సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు రావడం, ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో బుకింగ్స్‌ తగ్గకపోవడం చూస్తుంటే కలెక్షన్ల రేంజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకోవడం గురించి స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్లు ఆలోచనలో పడ్డారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.