English | Telugu
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఓటుకు రూ.10000
Updated : Aug 10, 2025
ఈ నెల 12న జరిగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా వ్యూహాలు రచిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కంచుకోటైన పులివెందుల స్ధానంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓటుకు రూ.10000 ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్దమైనట్లు సమాచారం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీలను గతంలో వైసీపీనే గెలవగా తిరిగి కైవసం చేసుకోవడాని తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఓటింగ్ దగ్గరపడుతుండటంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. దానికి తోడు పులివెందుల ఉప ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ డబ్బును మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడానికి సిద్ధమైంది. పులివెందులలో ఓటుకోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్దమైంది. వైసీపీ అధినేత జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. ఎంత ఖర్చు చేసైనా సరే పులివెందుల స్థానాన్ని గెలవాలన్న కసిలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. ఇప్పుడు రెండు కాకపోయినా.. సొంతగడ్డ పులివెందులైనా గెలిచి తీరాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.