English | Telugu

ఆర్జీవీ 'వ్యూహం'.. వైఎస్ జగన్, భారతిని దింపేశారుగా!

"నేను అతి త్వరలో 'వ్యూహం' అనే పేరుతో ఓ రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్‌ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి" అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ 'వ్యూహం' సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటుల వివరాలు వెల్లడించారు.

'వ్యూహం' అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం. ఇందులో ఆర్జీవీ, వైఎస్ జగన్ పాత్రను హైలైట్ చేసి చూపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో జగన్‌ పాత్రలో 'రంగం' ఫేమ్ అజ్మల్‌, జగన్ సతీమణి భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించనున్నారు. ఆ పాత్రల్లో వారు ఎలా కనిపించనున్నారో తెలుపుతూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. జగన్, భారతి పాత్రలకు ఆ ఇద్దరు సరిగ్గా సరిపోయారు అనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని ఫోటోలలో మానసలో భారతి పోలికలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా గతంలో ఆర్జీవీ రూపొందించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రంలోనూ జగన్ పాత్రలో అజ్మల్‌ నటించడం విశేషం.

ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఇది 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' ఇతివృత్తంతో రూపొందుతోందని, త్వరలో ఇతర వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.