English | Telugu

నిరాహార దీక్ష‌కు దిగ‌నున్న స్టార్ ద‌ర్శ‌కుడి భార్య‌?

సినిమా వాళ్ల జీవితాల‌న్నీ పైపైన మెరుగులే. లోప‌లకు చూస్తే.. డొల్ల‌త‌నం తెలుస్తుంది. ఓ స్టార్ ద‌ర్శ‌కుడు, వెండి తెర‌పై నీతి సూత్రాలు వ‌ల్లించే ఓ మేధావి.. త‌న కుటుంబ జీవితాన్ని మాత్రం అత‌లాకుత‌లం చేసుకొన్నట్టు టాలీవుడ్ టాక్‌. రెండేళ్ల నుంచీ ఇంటికి వెళ్ల‌కుండా ఓస్టార్ హోట‌ల్‌లోనే మ‌కాం పెట్టేశాడ‌ట‌. దాంతో స‌ర‌దు ద‌ర్శ‌కుడి భార్య‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇటీవ‌ల త‌న భ‌ర్త నివాసం ఉంటున్న స్టార్ హోట‌ల్‌కి వెళ్లింది. ఆ లాబీలో గొడ‌వ‌కు దిగింది. త‌న భ‌ర్త ఇంటికి వ‌చ్చి త‌న‌తో కాపురం చేస్తాన‌ని మాటిస్తే త‌ప్ప అక్క‌డి నుంచి క‌ద‌ల‌న‌ని భీష్మించుకొని కూర్చొంద‌ట‌. అవ‌స‌ర‌మైతే నిరాహార దీక్ష చేస్తాన‌ని బెదిరించింద‌ట‌. దాంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు బెదిరిపోయిన‌ట్టు టాక్‌. ద‌ర్శ‌కుడి స‌న్నిహితులు ఆమెకు న‌చ్చ‌జెప్పి పంప‌డంతో పెద్ద రాద్దాంతం నుంచి ఆ ద‌ర్శ‌కుడు తృటిలో త‌ప్పించుకొన్నాడ‌ని తెలుస్తోంది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేదానిపై ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.